పెళ్లి చేసుకున్న తమిళ హాస్య నటుడు

Published on Feb 05,2020 04:34 PM

తమిళ హాస్య నటుడు యోగిబాబు పెళ్లి మంజు భార్గవి అనే మహిళతో జరిగింది. తమిళంలో స్టార్ హీరోలతో పోటీ పడి మరీ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు యోగిబాబు. ఇప్పుడున్న కమెడియన్ లలో అగ్రస్థానం యోగిబాబుదే కావడం గమనార్హం. పలువురు కమెడియన్ లు ఉన్నప్పటికీ కొంతమందికి అంతగా అవకాశాలు రావడం లేదు మరికొంతమంది హీరోలుగా మారారు దాంతో యోగిబాబుకు విపరీతమైన డిమాండ్ ఉంది తమిళనాట. ఇటీవలే రజనీకాంత్ నటించిన దర్బార్ చిత్రంలో నటించి మెప్పించాడు యోగిబాబు.

మంజు భార్గవి తో యోగిబాబు పెళ్లి కేవలం కొంతమంది సన్నిహితుల సమక్షంలోనే జరిగింది. మురుగన్ దేవాలయంలో ఈ పెళ్లి జరిగింది. అయితే త్వరలోనే చెన్నై లో రిసెప్షన్ ఏర్పాటు చేసాడట యోగిబాబు. ఈ వేడుకకు పలువురు సినీ , రాజకీయ ప్రముఖులను ఆహ్వానించనున్నాడు. యోగిబాబు పెళ్లి కావడంతో అతడికి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు అందజేస్తున్నారు సినీ ప్రముఖులు.