దారుణ హత్య చేసిన దర్శకుడు

Published on Feb 07,2019 11:41 AM

సహాయ నటి , తన భార్య అయిన సంధ్య ని దారుణంగా హత్య చేసాడు తమిళ దర్శకుడు బాలకృష్ణన్ . సంచలనం సృష్టించిన ఈ సంఘటన రెండు వారాల క్రితం జరుగగా నిన్న బాలకృష్ణన్ ని అరెస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది . తన భార్య ప్రవర్తన పై అనుమానం తో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు దర్శకుడు . తమిళ చిత్రాల్లో సహాయ నటి అయిన సంధ్య ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు దర్శకుడు బాలకృష్ణన్ . 

అయితే కొన్నాళ్ల పాటు కాపురం బాగానే సాగింది , అయితే 38 ఏళ్ల సంధ్య ప్రవర్తనలో మార్పు రావడంతో ఆమెకు వార్నింగ్ ఇచ్చాడు కానీ ఆమె తీరు మారలేదు సరికదా లక్ష్యపెట్టకుండా రాత్రి పూట బయటకు వెళ్తూ అక్రమ సంబంధం పెట్టుకోవడంతో విడాకులు తీసుకోవాలని అనుకున్నారు .  అయితే విడాకులకు సిద్ధం కావడంతో ఆమె మరింత స్వేచ్ఛగా తిరుగుతుండటంతో ముక్కలు ముక్కలుగా నరికి శరీర భాగాలను ఎక్కడెక్కడో పడేసాడు . అయితే పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి బాలకృష్ణన్ ని తమదైన శైలిలో విచారించగా ఈ విషయం బయట పడింది .