ఆ హీరోయిన్ శింబుని ప్రేమిస్తోందా ?

Published on Feb 27,2019 05:26 PM

తమిళ బిగ్ బాస్ లో పాల్గొని సంచలనం సృష్టించిన భామ ఓవియా . తాజాగా 90 ఎం ఎల్ అనే తమిళ చిత్రంలో నటించి వివాదానికి కేంద్ర బిందువు అయిన ఓవియా శింబుతో ప్రేమలో ఉన్నట్లు తమిళ నాట కథనాలు వస్తున్నాయి . ఆ కథనాలకు ఊతమిచ్చేలా శింబు జీవితంలో నేనుండాలి అని కోరుకుంటాను అంటూ మరో బాంబ్ పేల్చింది ఓవియా . 

అంతేనా నాకు ఏదైనా సమస్య వస్తే అది ఏ సమయంలో అయినా సరే మాట్లాడేంత చనువు ఉంది , అలాగే చక్కని పరిష్కారాలు ఇస్తాడు అంటూ శింబు గురించి బాగానే మాట్లాడుతోంది ఓవియా . శింబు ఇప్పటికే పలువురు హీరోయిన్ లతో ప్రేమాయణం సాగించాడు కానీ అవి పెళ్లి వరకు వెళ్ళలేదు ఇక ఇప్పుడేమో ఓవియా వంతు వచ్చింది పాపం .