రజనీకాంత్ పై తీవ్ర విమర్శలు

Published on Feb 01,2019 04:10 PM

సూపర్ స్టార్ రజనీకాంత్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు తమిళ నటుడు సీమాన్ . నామ్ తమిళర్ కచ్చి పార్టీ అధ్యక్షుడు కూడా అయిన సీమాన్ రజనీ పై విరుచుకు పడుతూ . రజనీకాంత్ ని అందరూ తలైవర్ (నాయకుడు ) అని సంబోధిస్తున్నారు అంటే మిగతా వాళ్ళు ఎవరు ? వాళ్లంతా దేశ ద్రోహులా ? అంటూ నిప్పులు కక్కాడు సీమాన్ . 

రజనీకాంత్ అంటే సీమాన్ అనే నటుడి కి పడదు దాంతో రజనీకాంత్ ని తలైవర్ .. తలైవర్ అని అంటున్నారని కామరాజ్ , ప్రభాకరన్ వీళ్లంతా నాయకులా? లేక దేశ ద్రోహులా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసాడు . తాజాగా సీమాన్ అనే నటుడు మిగమిగ అవసరం అనే చిత్రంలో నటించాడు . ఆ సినిమా విడుదలకు సిద్దమైన నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన సీమాన్ ఇలా వీరంగం వేసాడు .