తమన్నాకు ప్రభాస్ లాంటి మొగుడు కావాలట!

Published on Mar 10,2020 07:53 PM

తమన్నాకు ప్రభాస్ లాంటి మొగుడు కావాలట ! నాకు ఎలాంటి వాడు కావాలో తెలుసా ? నేను ఎలా పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నానో తెలుసా ....... అంటూ తన కోరికల చిట్టా విప్పింది మిల్కీ బ్యూటీ తమన్నా. నాకు స్వయం వరం ఏర్పాటు చేసుకొని అందులోంచి ప్రభాస్ లాంటి వాడ్ని ఎంపిక చేసుకొని పెళ్లి చేసుకోవాలని ఉందని , ప్రభాస్ తో పాటుగా విక్కీ కౌశల్ , హృతిక్ రోషన్ లాంటి వాళ్లలో ఎవరైనా ఓకే అని అంటోంది తమన్నా.

హృతిక్ రోషన్ , విక్కీ కౌశల్ , ప్రభాస్ ఈ ముగ్గురిలో ఎవరైనా నాకు భర్తగా లభిస్తే సంతోషమే కదా ! అని అంటోంది తమన్నా. గత 15 ఏళ్లుగా హీరోయిన్ గా తెలుగు , తమిళ , హిందీ చిత్రాల్లో నటిస్తున్న ఈ భామ ఇక పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధంగా ఉంది. గతకొంత కాలంగా ఈ భామకు చెప్పుకోతగ్గ సినిమాలు రావడం లేదు దాంతో ఇక పెళ్లి మీద గాలిమళ్లినట్లుంది. మొత్తానికి కాబోయే వాడు ఎలా ఉండాలో బాగానే కళలు కంటోందన్న మాట తమన్నా.