బాలయ్యని రిజెక్ట్ చేసిన తమన్నా

Published on Jan 05,2020 11:29 AM

నటసింహం నందమూరి బాలకృష్ణ కు హీరోయిన్ ల సమస్య పట్టి పీడిస్తోంది. ఈ సీనియర్ హీరోతో సినిమా చేసే ఛాన్స్ లు వస్తే కొందరు భామలు సున్నితంగా తిరస్కరిస్తున్నారు దాంతో బాలయ్య కోసం కొత్త భామలను లేదా వయసు మళ్ళిన వాళ్ళని తీసుకోవాల్సి వస్తోంది. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా కూడా బాలయ్య సినిమాని రిజెక్ట్ చేసిందట. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించనున్న చిత్రంలో ఇప్పటికే బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా ని అనుకుంటే ఆ భామ రిజెక్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఇక దాంతో తమన్నా ని కలిసారుట , కానీ తమన్నా మాత్రం నేను చేయను అని చెప్పకుండా డేట్స్ ఖాళీ లేవు అని సున్నితంగా తప్పించుకుందట. తమన్నా చేతిలో పెద్దగా సినిమాలు ఏవి లేవు కానీ డేట్స్ ఖాళీ లేవు అని చెప్పడం అంటే బాలయ్య సినిమాని కావాలనే పక్కన పెట్టడం అన్నమాటేగా. తమన్నా నో చెప్పడంతో ఇప్పుడు మరో భామని పట్టే పనిలో ఉన్నారు బోయపాటి అండ్ కో. సింహా , లెజెండ్ వంటి చిత్రాల తర్వాత బాలయ్య - బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది.