లిప్ లాక్ చేయనంటున్న తమన్నా

Published on Nov 13,2019 12:47 PM
లిప్ లాక్ చేయనంటున్న తమన్నా

మిల్కీ బ్యూటీ తమన్నా లిప్ లాక్ చేయనని సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. ఈరోజుల్లో సినిమాల్లో లిప్ లాక్ లు చాలా కామన్ అయిపోయాయి అయితే గ్లామర్ గా నటిస్తాను అందులో సందేహం లేదు ....... అభ్యంతరం లేదు కానీ లిప్ లాక్ లు మాత్రం చేయనని , ఆ నియమం పెట్టుకున్నానని అంటోంది తమన్నా. లిప్ లాక్ ఇస్తున్నట్లు నటించడానికి అభ్యంతరం లేదని కాకపోతే లిప్ లాక్ మాత్రం ఇవ్వనని తేల్చిపడేసింది తమన్నా.

తెలుగులోనే కాకుండా హిందీ , తమిళ , మలయాళ భాషలలో పలు చిత్రాల్లో నటించింది తమన్నా. అయితే హిందీ చిత్రాలపై ఎన్నో ఆశలు పెట్టుకుంది తమన్నా అయితే హిందీ ఆశలు మాత్రం నెరవేరడం లేదు తమన్నాకు. ఇక ఇటీవలే సైరా నరసింహారెడ్డి చిత్రంలో తమన్నా అద్భుతంగా నటించి ప్రశంసలు అందుకుంది. తాజాగా విశాల్ సరసన యాక్షన్ చిత్రంలో నటించింది. ఆ సినిమాలో రెచ్చిపోయి యాక్షన్ చిత్రాల్లో నటించింది తమన్నా.