మహేష్ చిత్రంలో ఐటెం భామగా తమన్నా

Published on Sep 09,2019 10:33 AM

మిల్కీ బ్యూటీ తమన్నా మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు చిత్రంలో ఐటెం సాంగ్ లో మెరవనున్నట్లు తెలుస్తోంది.  తమన్నా ఇంతకుముందు మహేష్ బాబు తో ఆగడు చిత్రంలో జంటగా నటించింది. ఆ సినిమా ప్లాప్ అయిందనుకోండి , ఆ తర్వాత మళ్ళీ మహేష్ బాబు - తమన్నా కలిసి నటించలేదు కట్ చేస్తే ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్ చిత్రంలో ఐటెం సాంగ్ చేయడానికి రెడీ అయ్యింది.
అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకుడు అన్న విషయం తెలిసిందే. ఇంతకుముందు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తమన్నా ఎఫ్ 2 లో నటించింది ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో తమన్నాని ఈ చిత్రంలో రిపీట్ చేస్తున్నాడు అనిల్ రావిపూడి. ఇక ఈ చిత్రంలో మహేష్ మేజర్ గా నటిస్తుండగా రష్మిక మందన్న మహేష్ సరసన నటిస్తోంది. ఒకప్పటి హీరోయిన్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని 2020 జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.