మహేష్ కు ఐటెం భామ తమన్నా నట

Published on Dec 01,2019 06:06 PM

మహేష్ బాబు తాజాగా సరిలేరు నీకెవ్వరు చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఆ చిత్రంలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుండగా మిల్కీ బ్యూటీ తమన్నా ఐటెం సాంగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. స్టార్ హీరోల సినిమాలు అంటే తప్పకుండా ఐటెం సాంగ్ ఉంటుందన్న విషయం కూడా విదితమే ! ఆ ఐటెం సాంగ్ లో తమన్నా నటించడం ఖాయమైపోయింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 11 న విడుదల కానుంది.

తమన్నా ఇంతకుముందు ఆగడు చిత్రంలో మహేష్ బాబు సరసన నటించింది , అయితే ఈ సినిమాలో మాత్రం ఐటెం భామగా మారింది. తమన్నా కు తెలుగులో పెద్దగా ఛాన్స్ లు లేకుండాపోయాయి. దాంతో కాబోలు ఇలా ఐటెం భామగా చేస్తుండొచ్చు. అలాగే మహేష్ బాబు సినిమా కాబట్టి ఆ క్రేజ్ తో పాటు మంచి రెమ్యునరేషన్ కూడా గిట్టుబాటు అవుతుండటంతో ఓకే చేసినట్లు తెలుస్తోంది.