తిడితే మంచిదేగా అంటున్న తమన్

Published on Dec 04,2019 02:30 PM
తిడితే మంచిదేగా అని అంటున్నాడు ప్రముఖ సంగీత దర్శకులు ఎస్ ఎస్ తమన్. తాజాగా తమన్ సంగీతం అందించిన చిత్రం ' వెంకీమామ '' ఈ చిత్రం డిసెంబర్ 13 న వెంకటేష్ పుట్టినరోజు సందర్బంగా విడుదల కానుంది. దాంతో మీడియా ముందుకు వచ్చిన తమన్ నా పాటలపై అప్పుడప్పుడు విమర్శలు వస్తుంటాయని అలా వస్తే మంచిదేగా నన్ను నేను సరిచేసుకోవడానికి ఆస్కారం లభిస్తుందని అంటున్నాడు.

గతంలో తమన్ స్వరపరిచిన పలు గీతాలకు కాపీ అంటూ నెటిజన్లు పెద్దగా విమర్శలు చేసేవాళ్ళు. ఆ విమర్శల జడివాన ఎక్కువ కావడం వల్లే కాబోలు తనలోని సృజనాత్మకతకు పదును పెట్టి ఉంటాడు అందువల్లే ఈమధ్య కాలంలో ప్రేక్షకులను అలరించే పాటలను అందిస్తున్నాడు. అంటే విమర్శలు మంచిదే అన్నమాట. వెంకీ మామ చిత్రంలో వెంకటేష్ నటన హైలెట్ గా నిలుస్తుందని అంటున్నాడు తమన్. వెంకటేష్ , నాగచైతన్య , రాశి ఖన్నా , పాయల్ రాజ్ పుత్ తదితరులు నటించిన ఈ చిత్రం డిసెంబర్ 13 న విడుదల కానుంది.