తలైవి ఫస్ట్ లుక్ వచ్చేసింది

Published on Nov 23,2019 04:01 PM

వివాదాస్పద భామ కంగనా రనౌత్ తాజాగా నటిస్తున్న చిత్రం '' తలైవి ''. జయలలిత బయోపిక్ గా తెరకెక్కుతున్న తలైవి చిత్రంలో జయలలిత పాత్ర పోషిస్తోంది కంగనా. కాగా ఈరోజు ఈ చిత్ర ఫస్ట్ లుక్ ని, మోషన్ పోస్టర్ ని విడుదల చేసారు. దర్శకులు ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా 2020 జూన్ 26 న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు తలైవి చిత్ర బృందం.

జయలలిత పాత్రలో కనిపించడానికి కంగనా రనౌత్ బాగానే కష్టపడినట్లు ఆమె రూపం చూస్తేనే తెలుస్తోంది. విప్లవానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచి ఎన్నో అవమానాలను అధిగమించి , దిగమింగుకొని పురుచ్చి తలైవి గా ఎలా ఎదిగింది అన్నదే ఈ చిత్ర కథాంశం. జయలలిత బయోపిక్ లో ఎన్నో కీలక ఘట్టాలు ఉన్నాయి అలాగే ఎన్నో మలుపులు ఉన్నాయి అవన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా అలరించేవే కావడంతో తప్పకుండా భారీ విజయం సాధించడం ఖాయమని ధీమాగా ఉన్నారు ఆ చిత్ర బృందం.