సంచలన వ్యాఖ్యలు చేసిన తాప్సీ

Published on Dec 07,2019 10:59 AM

హీరోయిన్ తాప్సీ సంచలన వ్యాఖ్యలు చేసి సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. సెక్స్ , లవ్ అనేవి రెండూ వేరు వేరు కాదని అలాగే సెక్స్ బాగా చేస్తేనే ప్రేమిస్తామనడం కరెక్ట్ కాదని సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఓ సర్వేలో భాగంగా తాప్సీ పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. అందులో భాగంగానే సెక్స్ ..... ప్రేమ విషయాల పట్ల తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది.

అలాగే ఇప్పుడు స్టార్ లుగా వెలుగొందుతున్న పలువురు సినీ వారసులు వాళ్ళ తల్లిదండ్రుల సపోర్ట్ లేకపోతే స్టార్స్ గా రాణించే వాళ్ళు కాదని , స్వయంకృషితో ఎదిగిన వాళ్ళు కాదని మరో బాంబ్ పేల్చింది తాప్సీ. ఫిలిం ఇండస్ట్రీలో వారసుల రాజ్యం రాజ్యమేలుతున్న విషయం తెలిసిందే. కొన్నాళ్ల క్రితం వరకు  గ్లామర్ పాత్రలకే పరిమితమైన తాప్సీ ఇటీవల విభిన్న కథా చిత్రాలను ఎంచుకుంటూ తనదైన పంథాలో రాణిస్తోంది బాలీవుడ్ లో.