సాహో రిజల్ట్ తో అప్రమత్తమైన సైరా టీమ్

Published on Sep 05,2019 09:31 AM

ప్రభాస్ నటించిన సాహో భారీ ఓపెనింగ్స్ సాధించినప్పటికీ ఓవరాల్ గా డిజాస్టర్ జాబితాలో చేరబోతోంది దాంతో సైరా నరసింహారెడ్డి టీమ్ అప్రమత్తమైంది. సాహో చిత్రానికి మొదటి మైనస్ ఎక్కువ నిడివి కలిగి ఉండటమే అని అంటున్నారు. సినిమాలో అనవసరమైన సన్నివేశాలు లేకుండా ఉంటే సాహో ఫలితం మరోలా ఉండేదని , అనవసరంగా పంతానికి పోయి ఎక్కువ నిడివితో సినిమా ని విడుదల చేసి దారుణమైన దెబ్బ తిన్నారని అందుకే సైరా లో అనవసరమైన సన్నివేశాలు ఏవో వాటిని తక్షణం తొలగించాలని మెగాస్టార్ చిరంజీవి ఆదేశాలు జారీ చేసాడట.
సాహో దాదాపు మూడు గంటల సినిమా ఇక సైరా నరసింహారెడ్డి చిత్రం కూడా దాదాపు మూడు గంటల నిడివి ఉన్న సినిమా కాబట్టి తక్షణం మరింత గ్రిప్పింగ్ గా స్క్రీన్ ప్లే ఉండేలా చర్యలు తీసుకోండని మెగాస్టార్ వార్న్ చేయడంతో ఇంకా ఎక్కడెక్కడ సినిమా స్లో అవుతుందో , కథకు ఇబ్బందిగా ఉందో వాటిని తొలగించే పనిలో పడ్డారట సైరా టీమ్. చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి అక్టోబర్ 2 న విడుదల అవుతున్న విషయం తెలిసిందే.