కర్నూల్ లో సైరా నరసింహారెడ్డి వేడుక

Published on Sep 06,2019 01:02 PM

కర్నూల్ పరిసర ప్రాంతం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్వగ్రామం దాంతో కర్నూల్ పరిసర ప్రాంతంలో సైరా నరసింహారెడ్డి వేడుక భారీ ఎత్తున చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిరు అండ్ కో. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తున్న చిత్రం ఈ సైరా నరసింహారెడ్డి. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 2 న భారీ ఎత్తున విడుదల చేయనున్న విషయం తెలిసిందే.
ఈ సినిమా వేడుకని కర్నూల్ లో చేయనున్నారు దాంతో ఈ వేడుకకు ముఖ్య అథితిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరు కానున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ తో పాటుగా మెగా హీరోలు కూడా ఈ వేడుకకు హాజరుకానున్నారట. రాంచరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ , నయనతార , విజయ్ సేతుపతి , జగపతిబాబు , అనుష్క , తమన్నా , నిహారిక , సుదీప్ తదితరులు నటిస్తున్నారు.