సైరా నరసింహారెడ్డి బుల్లితెరపై

Published on Nov 11,2019 05:10 PM

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం సైరా నరసింహారెడ్డి బుల్లితెర పై దర్శనం ఇవ్వనుంది. వెండితెర పై సంచలనం సృష్టిస్తుంది అని అనుకుంటే ఆశించిన స్థాయిలో వసూళ్ళని రాబట్టలేకపోయింది సైరా ! హిందీలో ప్లాప్ అయ్యింది అయితే తెలుగులో మాత్రం మంచి వసూళ్లనే సాధించింది సైరా. ఇక హిందీ వెర్షన్ సైరా డిసెంబర్ 6 న అమెజాన్ లో స్ట్రీమింగ్ కానుంది దాంతో ఆ రోజు నుండి సైరా ని అమెజాన్ లో వీక్షించొచ్చు.

ఇక తెలుగు వెర్షన్ ఎప్పటి నుండి అన్నది మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ గా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించాడు రాంచరణ్. ఇక ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది సురేందర్ రెడ్డి. హిందీ వెర్షన్ లో అమితాబ్ బచ్చన్ ఉన్నాడు అలాగే తమన్నా , నయనతార కూడా ఉన్నారు కాబట్టి అమెజాన్ లో మంచి వ్యూస్ సాధించడం ఖాయమనే చెప్పాలి.