హోటల్ బిజినెస్ లోకి సైరా దర్శకుడు

Published on Oct 31,2019 04:00 PM
సైరా నరసింహారెడ్డి చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డి హోటల్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నాడు. సినిమాల్లో సంపాదిస్తున్న సొమ్ము ని సద్వినియోగం చేసుకోవాలంటే ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టాలి, అలా పెట్టుబడులు పెట్టినప్పుడే ఆదాయమార్గం అవుతాయి. కెరీర్ డోలాయమానంలో ఉన్నప్పుడు ఇతర రంగాల్లో పెట్టిన పెట్టుబడులే అండగా నిలుస్తాయి ఆర్ధిక భరోసానిస్తాయి అందుకే సినిమా రంగంలోని పలువురు ఇతర రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారు.

వాళ్ళ దారిలోనే సైరా నరసింహారెడ్డి చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డి హోటల్ బిజినెస్ లోకి దిగుతున్నాడు. హోటల్ రంగంలో పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తుండటంతో ఈ దారి ఎందుకుంటున్నాడు సురేందర్ రెడ్డి. సైరా తో సూపర్ హిట్ అందుకున్న ఈ దర్శకుడు మళ్ళీ మెగా హీరోతోనే సినిమా చేసే పనిలో పడ్డాడు.