300 కోట్ల బిజినెస్ తో సైరా సంచలనం

Published on Sep 16,2019 11:38 AM

మెగాస్టార్ చిరంజీవి , అమితాబ్ బచ్చన్ , నయనతార , విజయ్ సేతుపతి , జగపతిబాబు , తమన్నా , సుదీప్ తదితరులు నటించిన సైరా నరసింహారెడ్డి బిజినెస్ పరంగా సంచలనం సృష్టిస్తోంది. అక్టోబర్ 2 న భారీ ఎత్తున తెలుగు , తమిళ , హిందీ , మలయాళ భాషలలో విడుదల కానున్న ఈ చిత్రం 300 కోట్ల బిజినెస్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా థియేట్రికల్ రైట్స్ ని 190 కోట్లకు అమ్మగా , శాటిలైట్ , డిజిటల్ , ఆడియో , డబ్బింగ్ రైట్స్ రూపంలో మరో 110కోట్ల బిజినెస్ చేసిందట.

అంటే ప్రపంచ వ్యాప్తంగా అన్ని హక్కుల రూపంలో 300 కోట బిజినెస్ జరుగగా థియేట్రికల్ పరంగా మాత్రం 190 కోట్లకు అమ్ముడుపోయింది కాబట్టి 200 కోట్ల షేర్ వస్తే సైరా ని కొన్న బయ్యర్లు సేఫ్ అవుతారు. మరి ఈ సినిమా 200 కోట్ల షేర్ రాబట్టగలదా ? లేదా ? అన్నది అక్టోబర్ 2 న తేలనుంది.