విడాకులు తీసుకుంటున్న హీరోయిన్

Published on Dec 10,2019 05:15 PM

టాలీవుడ్ లో హీరోయిన్ గా సత్తా చాటిన భామ శ్వేతాబసు ప్రసాద్ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించింది. శ్వేతాబసు ప్రసాద్ పెళ్లి జరిగి ఇంకా ఏడాది కూడా కాలేదు. గత సంవత్సరం డిసెంబర్ 13 న శ్వేతాబసు ప్రసాద్ - రోహిత్ ని పెళ్లి చేసుకుంది. అంటే సరిగ్గా చెప్పాలంటే ఇంకా ఏడాది కూడా కాలేదు కానీ అప్పుడే విడాకులకు సిద్ధమైపోయింది. గత ఏడాది 2018 డిసెంబర్ 13 న ఈ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయ్యాక రోహిత్ తో నా జీవితం అద్భుతంగా సాగుతోందని అతడిపై ప్రశంసల వర్షం కురిపించింది పెళ్ళైన తొలినాళ్లలో.

అయితే ఆ ముచ్చట ఇంకా తీరకముందే ఇద్దరి మధ్య తీవ్ర విబేధాలు నెలకొన్నాయట దాంతో ఆ గొడవలు మరింత పెద్దగా అవ్వక ముందే కలిసి జీవించడం కష్టం కాబట్టి విడిపోదాం అని నిర్ణయం తీసుకున్నారట. ఇంకేముంది విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించింది శ్వేతాబసు ప్రసాద్. తెలుగులో పలు చిత్రాల్లో నటించిన ఈ భామ పెద్ద వివాదంలో ఇరుక్కుంది, అయితే ఆ తర్వాత ఆ వివాదం నుండి బయటపడింది కూడా. వ్యభిచార కేసు నుండి బయటపడిన తర్వాత రోహిత్ ని పెళ్లి చేసుకుంది. కానీ ఆ పెళ్లి ఏడాది కాకుండానే విడాకులకు దారి తీసింది. బాలీవుడ్ లో పలువురు హీరోయిన్ లు విడాకులు తీసుకోవడం చాలా కామన్ అయిపొయింది.