పూజా హెగ్డే తో రొమాన్స్ చేయనున్న సూర్య

Published on Mar 30,2020 11:19 PM
హాట్ భామ పూజా హెగ్డే కు పెద్ద ఎత్తున ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. ఇప్పటికే అల ...... వైకుంఠపురములో చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ భామ మరింత జోష్ మీదుంది. ఇన్నాళ్లు అంతగా కమర్షియల్ హిట్స్ లేకపోయినప్పటికీ కేవలం తన ఫిగర్ తోనే స్టార్ హీరోల చిత్రాల్లో ఛాన్స్ లు కొట్టేసింది. అయితే ఇన్నాళ్లకు తన గ్లామర్ కు తోడు భారీ హిట్స్ కూడా వస్తున్నాయి దాంతో అవకాశాలు కూడా వెల్లువలా వచ్చి పడుతున్నాయి.

తాజాగా తమిళ స్టార్ హీరో సూర్య చిత్రంలో నటించే ఛాన్స్ ఈ భామని వరించిందట. ఇక ఈ చిత్రానికి దర్శకుడు హరి. ఈ దర్శకుడు పక్కా కమర్షియల్ డైరెక్టర్ అన్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు హరి- సూర్య ల కాంబినేషన్ లో పలు హిట్ చిత్రాలు వచ్చాయి. దాంతో ఈ కాంబినేషన్ కు ఎనలేని క్రేజ్ ఏర్పడింది. ఈ ఇద్దరికీ తోడు హాట్ భామ పూజా హెగ్డే కూడా తోడవ్వడంతో మరింత క్రేజ్ రానుంది.