ప్లాప్ డైరెక్టర్ కు మళ్ళీ ఛాన్స్ ఇచ్చిన సూర్య

Published on Mar 02,2020 09:36 PM

తమిళ దర్శకులు హరి కి మళ్ళీ ఛాన్స్ ఇచ్చాడు తమిళ హీరో సూర్య. హరి - సూర్య కాంబినేషన్ లో మొత్తం 5 సినిమాలు వచ్చాయి ఇప్పటి వరకు. ఆ ఐదు చిత్రాల్లో నాలుగు హిట్స్ ఒక్కటే సింగం 3 ప్లాప్. ఆరు , వేల్ , సింగం , సింగం 2 , సింగం 3 ఇలా మొత్తం అయిదు చిత్రాలు రాగా సింగం 3 మాత్రమే ప్లాప్ అయ్యింది. సింగం 3 తర్వాత సామి 2 చేసాడు విక్రమ్ తో ఆ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది దాంతో హరి తో సినిమాలు చేయడానికి భయపడ్డారు హీరోలు. '

కట్ చేస్తే సూర్య మాత్రం హరి తో మరో సినిమా చేయాలనీ ఫిక్స్ అయ్యాడట ! ఎందుకంటే హరి దర్శకత్వంలో నటించిన సినిమాలే తనకు ఊహించని స్టార్ డంని తెచ్చిపెట్టాయని భావిస్తున్నాడు. అందుకే మరోసారి ఛాన్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడట. ఇక ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఆరో చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఆ చిత్రానికి '' ఆరువా '' అనే టైటిల్ ని కూడా ఖరారు చేశారట. మరి ఈ సినిమాతోనైనా హరి సక్సెస్ కొడతాడో చూడాలి.