ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి

Published on Mar 12,2019 05:00 PM

నాగశౌర్య - మాళవిక నాయర్ లు జంటగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు కాగా ఈ చిత్రానికి తాజాగా అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా ...... .... ఫలానా అబ్బాయి - ఫలానా అమ్మాయి . వినడానికి విచిత్రంగా ఉన్నప్పటికీ ఇదే టైటిల్ గా పెట్టాలని అనుకుంటున్నారా ! ఇంకా ఫైనల్ చేయలేదు కానీ ఇదే పక్కా అని అంటున్నారు . 

నాగశౌర్య అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో నటించిన రెండు చిత్రాలు కూడా మంచి హిట్స్ అయ్యాయి దాంతో ఈ సినిమాపై బాగా నమ్మకంగా ఉన్నాడట ! అలాగే హీరోయిన్ మాళవిక నాయర్ తో కూడా చేసిన కల్యాణ వైభోగమే చిత్రం హిట్ అయ్యింది దాంతో తప్పకుండా హిట్ కొడతామన్న ధీమా వ్యక్తం చేస్తున్నాడు ఫలానా అబ్బాయి నాగశౌర్య .