యాషిక ఆనంద్ పై సూర్య ఫ్యాన్స్ దాడి

Published on Jan 22,2019 11:06 AM

హీరోయిన్ యాషిక ఆనంద్ పై తమిళ స్టార్ హీరో సూర్య అభిమానులు దాడి చేసారు . దాడి అనగానే భౌతిక దాడి అనుకునేరు కాదు సుమా ! సోషల్ మీడియా లో పోస్ట్ ల దాడి అన్నమాట ! ఇంతకీ సూర్య అభిమానులు యాషిక ఆనంద్ పై ట్వీట్ వార్ చేయడానికి కారణం ఏంటో తెలుసా ...... సూర్య అంటే నాకు చాలా చాలా ఇష్టమని , అతడ్ని పెళ్లి చేసుకొని కాపురం చేయాలనీ ఉందని పేర్కొనడమే ! 

సూర్య హీరోయిన్ జ్యోతిక ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు , అలాగే ఇద్దరు పిల్లలు కూడా దాంతో పెళ్లి అయి పిల్లలున్న సూర్య ని పెళ్లి చేసుకుంటానని ఎలా అంటావ్ అని సూర్య ఫ్యాన్స్ ట్రోల్ చేయడంతో ఆ తిట్లు భరించలేక వెంటనే తన పోస్ట్ ని డిలీట్ చేసింది పాపం . అయినా సూర్య ని చేసుకుంటానని ఓ అభిమాని ప్రశ్నిస్తే సమాధానం ఇచ్చింది కొంటెగా కానీ అది ఇలా రివర్స్ అయ్యింది పాపం .