సల్మాన్ తో సినిమా చేయాలనీ చూస్తున్న సురేందర్ రెడ్డి

Published on Sep 10,2019 11:38 AM

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తో సినిమా చేసే ఛాన్స్ కోసం ఎదురు చేస్తున్నాడు సైరా నరసింహారెడ్డి దర్శకుడు సురేందర్ రెడ్డి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం భారీ ఎత్తున తెలుగు , తమిళ , హిందీ , మలయాళ బాషలలో విడుదల కానున్న విషయం తెలిసిందే. పైగా సైరా లో లెజెండ్ అమితాబ్ బచ్చన్ కూడా నటించిన సంగతి తెలిసిందే.
దాంతో సైరా పెద్ద హిట్ అవ్వడం ఖాయమని , సల్మాన్ ఖాన్ తో కూడా సినిమా చేసే చాన్స్ వస్తుందని ఆశిస్తున్నాడు సురేందర్ రెడ్డి.సల్మాన్ ఖాన్ నన్ను నమ్మి సినిమా చేసే ఛాన్స్ ఇస్తే తప్పకుండా చేస్తానని అంటున్నాడు సురేందర్ రెడ్డి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే స్వాతంత్య్ర సమరయోధుడు కథ కాబట్టి తప్పకుండా సైరా భారీ విజయం సాధించడం ఖాయమని ధీమాగా ఉన్నారు ఆ చిత్ర బృందం.