మహేష్ సినిమాలో విజయ్ దేవరకొండ అదిరిపోయే పాత్రట!

Published on Feb 03,2020 12:23 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో విజయ్ దేవరకొండ పాత్ర అదిరిపోయే రేంజ్ లో ఉండనుందట. మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించనున్న చిత్రంలో విజయ్ దేవరకొండ కూడా నటించనున్నాడట. మహేష్ బాబు అంటే విజయ్ దేవరకొండకు చాలా ఇష్టం దాంతో ఈ సూపర్ స్టార్ కు నయా సూపర్ స్టార్ తోడైతే సినిమా అదిరిపోయే రేంజ్ లో ఉంటుందని ఫిక్స్ అయ్యాడట దర్శకులు వంశీ పైడిపల్లి. మహర్షి చిత్రంలో అల్లరి నరేష్ పాత్రకు మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమాలో మాత్రం విజయ్ దేవరకొండ పాత్రకు అదిరిపోయే రెస్పాన్స్ రావడం ఖాయమని ఎందుకంటే విజయ్ దేవరకొండ పాత్ర హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు. మాఫియా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ పాత్ర తక్కువ సేపే ఉన్నప్పటికీ ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంటుందట. ఇక మహేష్ బాబు సీక్రెట్ ఏజెంట్ గా కనిపించనున్నాడు. మొత్తానికి జేమ్స్ బాండ్ తరహా చిత్రం అన్నమాట.