లీకైన చిరు లుక్ కి అద్భుత స్పందన

Published on Feb 24,2020 08:00 PM

మెగాస్టార్ చిరంజీవి తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో '' ఆచార్య '' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఆ సినిమాలోని చిరంజీవి లుక్ లీకయ్యింది. లీకైన చిరంజీవి లుక్ కి అద్భుతమైన స్పందన వస్తోంది. నక్సలైట్ గెటప్ లో ఉన్న చిరంజీవి మెగా ఫ్యాన్స్ ని విశేషంగా అలరిస్తున్నాడు. చిరంజీవి హెయిర్ స్టైల్ , గ్రీన్ చొక్కా మేడలో ఎర్రటి కండువా వీటికి తోడు చిరు గడ్డంతో ఉన్న చిరంజీవిని చూసి చాలా సంతోషంగా ఉన్నారు మెగా ఫ్యాన్స్.

కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన చిత్రాలన్నీ సందేశాత్మకమైనవే అన్న సంగతి తెలిసిందే. ఆ కోవలోనే ఈ సినిమా కూడా ఉండనుంది. ఇక ఈ సినిమాలో నక్సలైట్ గా ప్రోఫెసర్ గా రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు చిరంజీవి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 14 న విడుదల చేయాలనీ భావిస్తున్నారు నిర్మాత చరణ్. అయితే లొకేషన్ నుండి చిరంజీవి స్టిల్ లీక్ కావడంతో మరిన్ని కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకున్నారట.