సూపర్ హిట్ కొట్టిన నాగచైతన్య

Published on Apr 05,2019 05:48 PM

అక్కినేని నాగచైతన్య ఇన్నాళ్లకు సూపర్ హిట్ కొట్టేసాడు . గత ఏడాది నాగచైతన్య నటించిన రెండు చిత్రాలు రిలీజ్ కాగా రెండు కూడా డిజాస్టర్ లు అయ్యాయి దాంతో హిట్ కోసం పరితపించిపోతున్న సమయంలో మజిలీ చిత్రం నాగచైతన్య కు పెద్ద ఊరట నిచ్చింది . నిజంగానే మజిలీ చిత్రం నాగచైతన్య కెరీర్ లోనే గొప్ప చిత్రంగా నిలిచింది . పలువురు సినీ ప్రముఖులు ఈ చిత్రాన్ని చూసి చైతూ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు . 

ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయిన మజిలీ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి . అలాగే చైతూ - సమంత ల నటనకు జేజేలు పలుకుతున్నారు ప్రేక్షకులు . ఇక చైతూ నటనకు  ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు పలువురు సినీ ప్రముఖులు . 

హిట్ కావాలని తపన పడుతున్న సమయంలో ఒయాసిస్ లా మజిలీ చైతూ ని ముంచెత్తింది దాంతో సమంత కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది . భర్తకు మంచి హిట్ రావాలని ఆశించిన సమంత కు మజిలీ హిట్ టాక్ తో పరవశించి పోతోంది .