సన్నీ లియోన్ తో విశాల్

Published on Feb 04,2019 04:23 PM

మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ తో క్రేజీ హీరో విశాల్ ఆడి పాడనున్నాడు . తమిళ స్టార్ హీరో విశాల్ తాజాగా తమిళంలో '' అయోగ్య '' అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . తెలుగులో ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ చిత్రం టెంపర్ కు రీమేక్ గా రూపొందుతోంది . కాగా ఆ చిత్రంలో ఐటెం సాంగ్ కోసం సన్నీ లియోన్ ని సంప్రదించగా సంతోషంగా ఒప్పుకుందట . 

ఇంకేముంది విశాల్ కూడా సన్నీ లియోన్ కంటే ఎక్కువగా సంతోషం వ్యక్తం చేస్తున్నాడట . ఈ సినిమా కోసం త్వరలోనే సన్నీ లియోన్ - విశాల్ లపై ఐటెం సాంగ్ చిత్రీకరించనున్నారు . విశాల్ అయోగ్య చిత్రంపై భారీగా ఆశలు పెట్టుకున్నాడు ఎందుకంటే ప్లాప్ లతో ఇబ్బంది పడుతున్న ఎన్టీఆర్ ని మళ్ళీ సక్సెస్ లతో ఊపందుకునేలా చేసింది టెంపర్ చిత్రమే !