రంగీలా చిత్రంలో సన్నీ లియోన్

Published on Jan 25,2019 12:33 PM

పోర్న్ స్టార్ గా కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టిన భామ సన్నీ లియోన్ తాజాగా మలయాళ చిత్ర రంగంలో '' రంగీలా '' చిత్రంతో అడుగుపెడుతోంది . పరిచయం అక్కర్లేని భామ సన్నీ లియోన్ అయితే పోర్న్ సినిమాలను వదిలేసి భారతీయ చిత్రాల్లో ఎక్కువగా నటిస్తున్న ఈ భామకు డబ్బులు , పేరు వస్తోంది కానీ ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోవడం లేదు . బాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన ఈ భామ సౌత్ లో కూడా నటిస్తోంది . 

తాజాగా మలయాళ సినిమా రంగీలా లో హీరోయిన్ గా నటిస్తోంది సన్నీ లియోన్ . రంగీలా సినిమాతో పాటుగా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తో ఓ సినిమాలో ఐటెం సాంగ్ చేయడానికి కూడా అంగీకరించింది . ఇక రంగీలా విషయానికి వస్తే ఫిబ్రవరి నుండి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది . దాంతో చాలా చాలా సంతోషంగా ఉందట సన్నీ లియోన్ .