పెళ్లి చేసుకోలేదంటున్న భామ

Published on Dec 30,2019 02:35 PM

తెలుగు , తమిళ హీరోయిన్ సునైనా తనకు పెళ్లి కాలేదని అంటోంది. తనకు పెళ్లి అయ్యిందని వస్తున్న వార్తలు అబద్దమని ఖండించింది సునైనా. అయితే సునైనా కు పెళ్లి అయ్యిందని  వార్తలు రావడానికి కారణం ఏంటో తెలుసా ....... సోషల్ మీడియాలో ఒక వ్యక్తితో ఉన్న ఫోటోని షేర్ చేయడమే ! సునైనా పక్కన ఉన్న వ్యక్తిని చూసి ఆమె రహస్యంగా వివాహం చేసుకుందని రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. అయినా ఎవరో తెలియని వ్యక్తి ఫోటోని షేర్ చేయడం అంటే రకరకాల ఊహాగానాలు రావడం సహజమే కదా!

తెలుగులో అలాగే తమిళ్ లో పలు చిత్రాల్లో నటించింది సునైనా అయితే ఈ భామకు స్టార్ డం మాత్రం దక్కలేదు. అయితే మంచి నటిగా మాత్రం పేరు తెచ్చుకుంది. కెరీర్ ఎక్కడికో పోతుందని అనుకుంటే ఇలా ఎటూ కాకుండాపోవడంతో పాపం బాధపడుతోంది సునైనా. అసలే ఆ బాధలో ఉంటే ఇప్పుడేమో పెళ్లి అంటూ వార్తలు ఇబ్బంది పెడుతున్నాయి దాంతో నేను పెళ్లి చేసుకుంటే మీకు చెప్పే చేసుకుంటాను అంటూ తెలిపింది సునైనా.