దర్శకులు సుకుమార్ కు ఎదురు దెబ్బలు

Published on Apr 04,2019 11:02 AM

గత ఏడాది రంగస్థలం చిత్రంతో ప్రభంజనం సృష్టించిన దర్శకుడు సుకుమార్ . అయితే అలాంటి సంచలన విజయం అందుకున్న తర్వాత కూడా సుకుమార్ కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి . మహేష్ బాబు తో సినిమా కన్ఫర్మ్ అయి కూడా క్యాన్సిల్ అయ్యింది ఆ షాక్ లో ఉన్న సుకుమార్ తాజాగా మరో షాక్ తగిలింది . నాగశౌర్య హీరోగా తన శిష్యుడి దర్శకత్వంలో ఓ సినిమా చేయాలనీ అనుకున్నాడు . 

ఆ సినిమా కూడా ఇక సెట్స్ పైకి వెళ్లడమే తరువాయి అని అనుకుంటున్న సమయంలో నాగశౌర్య సినిమా క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది . రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత కూడా సుకుమార్ ఇలా ఎదురు దెబ్బలు తింటుండటంతో షాక్ అవుతున్నాడు . ఇక మహేష్ బాబు తో సినిమా క్యాన్సిల్ కావడంతో అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు మరి ఆ సినిమా ఏమౌతుందో ?