కుమిలిపోతున్న సుడిగాలి సుధీర్

Published on Feb 24,2020 08:04 PM

సుడిగాలి సుధీర్ కుమిలిపోతున్నాడు. బుల్లితెరపై సంచలనం సృష్టిస్తున్న సుధీర్ కుమిలిపోవడానికి కారణం ఏంటో తెలుసా ........ సినిమాల్లో హీరోగా నటించి దెబ్బతిన్నందుకు. బుల్లితెరపై సంచలనం సృష్టించే సుడిగాలి సుధీర్ అదే వెండితెరపై మాత్రం ఏమాత్రం ప్రభావం చూపించలేకపోతున్నాడు. కమెడియన్ గా పలు చిత్రాల్లో నటించాడు అవి ప్లాప్ అయినా పెద్దగా పట్టించుకోలేదు కానీ హీరోగా రెండు సినిమాలలో నటించాడు. ఒకటి సాఫ్ట్ వేర్ సుధీర్ , మరొకరి 3 మంకీస్. ఈ రెండు కూడా ప్లాప్ అయ్యాయి.

హీరోగా నటించిన రెండు సినిమాలు కనీస ఆదరణకు కూడా నోచుకోకపోవడంతో చాలా బాధపడుతున్నాడట. హీరోగా మంచి కథలే ఎంచుకున్నాను కదా ! తప్పకుండా హిట్ కొడతామన్న ధీమాలో ఉన్నాడట ! అయితే ఆ రెండు సినిమాలు కూడా డిజాస్టర్ లు కావడంతో ఇకపై సినిమాల్లో హీరోగా నటించాలంటే ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకోవాలని డిసైడ్ అయ్యాడట, మాగ్జిమమ్ సినిమాల్లో హీరోగా నటించకూడదని ఒకవేళ పక్కా స్క్రిప్ట్ అలాగే మంచి దర్శకుడు సెట్ అయితేనే చేయాలనే నిర్ణయానికి వచ్చాడట సుధీర్.