లక్ష్మీస్ ఎన్టీఆర్ కు భారీ ఓపెనింగ్స్

Published on Mar 30,2019 10:10 AM

వివాదాస్పద చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి . నిన్న తెలంగాణలో రిలీజ్ అయ్యింది లక్ష్మీస్ ఎన్టీఆర్ . అత్యంత నాటకీయ పరిస్థితుల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రానికి అనూహ్య స్థాయిలో వసూళ్లు రావడంతో ట్రేడ్ విశ్లేషకులు ఆశ్చర్యానికి లోనౌతున్నారు . ఎందుకంటే గతకొంత కాలంగా రాంగోపాల్ వర్మ చిత్రాలన్నీ డిజాస్టర్ లు అవుతున్నాయి . 

రిలీజ్ కి ముందు ఎంతగానో హైప్ క్రియేట్ చేస్తాడు వర్మ తీరా సినిమాలో మాత్రం తుస్సు మనిపిస్తాడు దాంతో ఈ సినిమా కూడా అలాగే అనుకున్నారు . కానీ ఆ ఆలోచనలకూ భిన్నంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ ని రూపొందించి సక్సెస్ అయ్యాడు వర్మ . దాంతో ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి . మల్టీప్లెక్స్ లలో ఇంకా ఆదరణ ఎక్కువ లభిస్తుండటం విశేషం .