జార్జ్ రెడ్డి ని అడ్డుకుంటామంటున్న స్టూడెంట్స్

Published on Nov 19,2019 09:40 PM

జార్జ్ రెడ్డి సినిమా జార్జ్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా లేకపోతే సహించేది లేదని , సినిమాని అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేసారు పీడీఎస్ యు జాతీయ అధ్యక్షుడు ఎం. రామకృష్ణ. అంకిత భావం ఉన్న స్టూడెంట్స్ ని ఏకం చేసి ఉస్మానియా యూనివర్సిటీ లో అన్యాయాలను ఎదుర్కొన్న గొప్ప పోరాట యోధుడు జార్జ్ రెడ్డి. అణు భౌతిక శాస్త్రంలో గోల్డ్ మెడల్ సాధించిన జార్జ్ రెడ్డి విద్యార్ధి లోకానికి మరో చేగువేరా. అలాంటి మహనీయుడి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రాన్ని వక్ర భాష్యం తో చిత్రీకరిస్తే సహించేది లేదని , సినిమాని అడ్డుకుంటామని హెచ్చరించారు.

1972 లో జార్జ్ రెడ్డి ని ఉస్మానియా యూనివర్శిటీ గేటు ముందే అత్యంత పాశవికంగా హత్య చేసారు కిరాయి హంతకులు. అప్పట్లో జార్జ్ రెడ్డి హత్య సంచలనం సృష్టించింది. అదే కథాంశంతో జార్జ్ రెడ్డి చిత్రం రూపొందింది. ఈనెల 22 న ఈ సినిమా విడుదల అవుతోంది. దాంతో ఆ సినిమా చుట్టూ పలు వివాదాలు రాజుకుంటున్నాయి