హీరో విజయ్ కి విగ్రహం పెట్టారు

Published on Nov 24,2019 06:21 PM

తమిళనాట రజనీకాంత్ తర్వాత అంతటి స్టార్ డం ఉన్న హీరో విజయ్ దాంతో ఆ హీరోకు తమిళనాట మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసారు విజయ్ అభిమానులు. తమిళనాట అభిమానులు తమ హీరోలను దేవుళ్ళుగా కొలుస్తారనే విషయం తెలిసిందే. ఇక విజయ్ కి మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అందుకే తమ హీరో మైనపు విగ్రహాన్ని పెట్టారు , దేవుడిగా కొలుస్తున్నారు. ఈ విగ్రహాన్ని కన్యాకుమారిలో పెట్టారు.

ఇక విజయ్ విగ్రహం దగ్గరకు పెద్ద ఎత్తున టూరిస్టు లు వస్తూ ఫోటోలకు ఫోజిస్తున్నారు. హీరోలకు , హీరోయిన్ లకు గుడి కట్టడం తమిళనాట సాధారణమైన విషయమే! తాజాగా విజయ్ నటించిన బిగిల్ సంచలన విజయం సాధించింది. తెలుగులో ఈ చిత్రం విజిల్ పేరుతో డబ్ అయ్యింది . తమిళంలో మాత్రమే కాదు తెలుగులో కూడా మంచి విజయం సాధించింది విజిల్. ఇక ఇప్పుడేమో 64 వ చిత్రానికి రెడీ అవుతున్నాడు విజయ్.