చిరంజీవి - మహేష్ ల మధ్య స్టార్ వార్

Published on Mar 06,2019 03:34 PM

మూవీ ఆర్టిస్ట్ ఎన్నికలు చిరంజీవి - మహేష్ బాబు ల మధ్య యుద్దాన్ని తలపింపజేసేలా ఉంది . మార్చి 10 న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో శివాజీరాజా ప్యానల్ తోపాటుగా నరేష్ ప్యానల్ కూడా పోటీ చేస్తోంది . శివాజీరాజా ప్యానల్ కు మెగాస్టార్ చిరంజీవి మద్దతు ఇస్తుండగా నరేష్ ప్యానల్ కు మాత్రం మహేష్ బాబు మద్దతు ఇస్తున్నాడు . దాంతో స్టార్ వార్ మొదలయ్యింది . 

ఎన్నికలు మాత్రం శివాజీరాజా - నరేష్ ల మధ్య జరుగుతున్నాయి కానీ తెరవెనుక మాత్రం చిరంజీవి - మహేష్ బాబు ల మధ్య యుద్ధం జరుగనుంది . ఈ ఇద్దరిలో విజయం సాధించేది ఎవరో తెలియాలంటే మాత్రం ఈనెల 10 వరకు ఆగాల్సిందే . అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే శివాజీరాజా ప్యానల్ ముందంజలో ఉంది ఎన్నికల నాటికీ . ఫలితాల నాటికీ ఇదే కంటిన్యూ అవుతుందా ? ఏమైనా మారుతుందా ? చూడాలి .