సైరా చిత్రాన్నిచూడనున్న ఎస్ ఎస్ రాజమౌళి

Published on Sep 11,2019 07:34 PM

దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని చూడనున్నాడు , సైరా ని చూసిన తర్వాత మార్పులు ఏమైనా అవసరమా ? లేదా ? అనేది చెప్పనున్నాడట. సైరా ని చూపించి అతడి నుండి తగిన సలహాలు , సూచనలు తీసుకొని అప్పుడు విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి , రాంచరణ్ లు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందిన చిత్రం సైరా ..... నరసింహారెడ్డి.

సాహో చిత్రం డిజాస్టర్ కావడంతో సైరా బృందంలో వణుకు మొదలయ్యింది అందుకే ఇలా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సైరా పై పూర్తి నమ్మకం ఉన్నప్పటికీ , ఎందుకైనా మంచిది రిస్క్ తీసుకోవడం ఎందుకని ఇలా ప్లాన్ చేస్తున్నాడు చరణ్. అక్టోబర్ 2 న సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. తెలుగు , తమిళ , మలయాళ , హిందీ బాషలలో సైరా విడుదల కానుంది.