ఎస్ ఎస్ రాజమౌళి తదుపరి చిత్రం కన్ఫర్మ్

Published on Apr 18,2020 04:13 PM
ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని ఏ హీరోతో చేయనున్నాడో తెలుసా ..... ఇంకెవరు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతోనే. అసలు మహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్ లో సినిమా ఎప్పటి నుండో అనుకుంటున్నారు కానీ అది వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. అయితే ఎట్టకేలకు ఇన్నాళ్లకు ఈ కాంబినేషన్ సెట్ అయినట్లు తెలుస్తోంది. అంతేకాదు తన తదుపరి చిత్రం మహెష్ బాబు తో అని కుండబద్దలు కొట్టి మరీ చెప్పాడట రాజమౌళి తన సన్నిహితుల వద్ద.

మహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్ లో సినిమా అంటే ఫ్యాన్స్ ఆనందానికి అవధులే ఉండవు. ఈ ఏడాది ఆరంభంలో సరిలేరు నీకెవ్వరు చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు మహేష్ బాబు. ఇక ఇప్పుడేమో పరశురాం దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలాగే రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఆసినిమా కంప్లీట్ అయ్యాక మహేష్ సినిమా కోసం స్క్రిప్ట్ సిద్ధం చేయనున్నాడు రాజమౌళి. ఇక ఈ సినిమాకు కూడా జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించనున్నాడు.