మందు మానేసానంటున్న శృతి హాసన్

Published on Mar 02,2020 09:46 PM

మామూలుగానే మద్యం తీసుకునేదాన్ని ఇక డిప్రెషన్ లోకి వెళ్ళాకా ఇంకా ఎక్కువ మద్యం తీసుకున్నానని ,దానికి బానిస అయ్యానని కానీ ఇప్పుడు మద్యం మానేసానని సంచలన వ్యాఖ్యలు చేసింది అందాల భామ శృతి హాసన్. తెలుగునాట స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ భామ సినిమాలను పక్కన పెట్టి లవ్వు కొవ్వు అని తిరిగింది కట్ చేస్తే మైఖేల్ హ్యాండ్ ఇచ్చి పరదేశి పరదేశి అంటూ పరదేశానికి వెళ్ళిపోయాడు దాంతో మద్యానికి బానిస అయ్యింది శృతి హాసన్.

అంతేకాదు సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందట ! ఆ విషయాన్నీ ఇప్పుడు ఒప్పుకుంది. తన ముఖం పై కాంతి తగ్గడంతో నెటిజన్లు పలు ప్రశ్నలు కురిపించారు దాంతో ప్లాస్టిక్ సర్జరీ విషయాన్ని , మద్యం విషయాన్నీ ఒప్పుకుంది అంతేనా ...... నెలసరి సమస్యతో కూడా చాలా ఇబ్బంది పడుతున్నానని చెప్పేసింది పాపం. మద్యం తీసుకోవడం వల్ల పాపం చాలా సమస్యలు ఎదుర్కొంటోంది శృతి హాసన్.