పవన్ తో మళ్ళీ రొమాన్స్ చేయనున్న శృతి హాసన్

Published on Mar 07,2020 01:28 PM

అందాల భామ శృతి హాసన్ మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో రొమాన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ సరసన గబ్బర్ సింగ్ చిత్రంలో అలాగే కాటమ రాయుడు చిత్రంలో నటించింది శృతి హాసన్. అయితే గబ్బర్ సింగ్ పెద్ద హిట్ అయ్యింది కానీ కాటమ రాయుడు మాత్రం ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేదు. కట్ చేస్తే ఇప్పుడు మూడోసారి పవన్ తో రొమాన్స్ చేయడానికి సిద్ధం అవుతోందట శృతి హాసన్.

ఇప్పటికే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ చిత్రంలో నటిస్తున్న పవన్ మరోవైపు క్రిష్ దర్శకత్వంలో కూడా మరో సినిమా చేస్తున్నాడు. ఏకకాలంలో రెండు చిత్రాలను సెట్స్ మీదకు తీసుకెళ్లిన పవన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా మరో సినిమా చేయడానికి ఒప్పుకున్న సంగతి తెలిసిందే. కాగా ఆ సినిమాలోనే శృతి హాసన్ ని తీసుకోవాలని భావిస్తున్నాడట హరీష్ శంకర్. ఎందుకంటే గబ్బర్ సింగ్ చిత్రం పవన్ కళ్యాణ్ - శృతి హాసన్ - హరీష్ శంకర్ ల కాంబినేషన్ లో వచ్చింది కాబట్టి అదే సెంటిమెంట్ తో ప్లాన్ చేస్తున్నాడట హరీష్ శంకర్.