తప్పతాగి రచ్చ రచ్చ చేసిన శృతి హాసన్

Published on Jan 30,2020 03:38 PM

అందాల భామ శృతి హాసన్ తప్ప తాగి రోడ్డు మీద చేసిన డ్యాన్స్ వైరల్ అవుతోంది. ఈ భామ ఇటీవలే 34 ఏళ్ళు కంప్లీట్ చేసుకొని 35 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టింది. దాంతో తన పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని శృతి హాసన్ వీర లెవల్లో రెచ్చిపోయింది. రోడ్డు మీదే డ్యాన్స్ చేసిన తీరుకి మందేసి చిందేసినట్లుగా భావిస్తున్నారు. గతకొంత కాలంగా సరైన సినిమాలు లేక కెరీర్ లో వెనుకబడిపోయింది శృతి హాసన్.

కట్ చేస్తే రవితేజ సరసన క్రాక్ చిత్రంలో ఛాన్స్ వచ్చింది ఈ భామకు. ఆ సినిమా మేలో విడుదల కానుంది. ఆ సినిమా విడుదల అయితే కానీ తెలీదు శృతి హాసన్ కు మళ్ళీ మంచి రోజులు వస్తాయో లేదో అనేది. కెరీర్ ని పక్కన పెట్టి ప్రియుడి మోజులో పడిన ఈ భామ ప్రేమ విఫలం కావడంతో మళ్ళీ సినిమాలపై దృష్టి పెట్టింది. క్రాక్ సినిమాతో టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తోంది. రవితేజ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా నటిస్తున్నాడు ఈ క్రాక్ చిత్రంలో.