నానిపై దాడి జరగడంతో సంతోషంగా ఉన్న శ్రీరెడ్డి

Published on Nov 21,2019 01:04 PM

కాస్టింగ్ కౌచ్ వివాదాన్ని రాజేసి టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించిన భామ శ్రీ రెడ్డి కి హీరో నాని అంటే విపరీతమైన కోపం దాంతో తాజాగా నాని ఇంటి పై ఆఫీసు పై ఐటీ అధికారులు దాడులు చేయడంతో చాలా సంతోషం వ్యక్తం చేస్తోంది. ప్రధాని మోడీ కి కృతఙ్ఞతలు తెలియజేస్తోంది శ్రీరెడ్డి. నాని అంటే ఇంతగా కోపం ఎందుకో తెలుసా ...... తనకు సినిమాలో ఛాన్స్ లు ఇప్పిస్తానని ఈ భామని మోసం చేసాడట !

దాంతో అప్పటి నుండి శ్రీ రెడ్డి పగబట్టింది నాని పైన. చీటికీ మాటికీ నాని పై ఆరోపణలు గుప్పిస్తూ నాని కి నిద్ర లేకుండా చేస్తున్న సంగతి తెలిసిందే. హీరో నాని నటించడమే కాకుండా సినిమా నిర్మాణ రంగంలోకి కూడా దిగాడు దాంతో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు నిన్న. ఈ విషయం శ్రీరెడ్డి చెవిన పడటంతో ఉబ్బి తబ్బిబ్బై పోతోంది. నాని పైనే కాదు సురేష్ బాబు , వెంకటేష్ , నాగార్జున ఆఫీసుల మీద కూడా ఐటీ దాడులు జరగడంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది శ్రీరెడ్డి.