నాగబాబుని బూతులు తిడుతున్న శ్రీరెడ్డి

Published on Dec 02,2019 01:44 PM

మెగా బ్రదర్ నాగబాబు ని బూతులు తిడుతోంది వివాదాస్పద నటి శ్రీరెడ్డి. జబర్దస్త్ పై నాగబాబు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో శ్రీ రెడ్డి తీవ్ర ఘాటు విమర్శలు చేస్తూ తన ఫేస్ బుక్ పేజీలో సంచలన వ్యాఖ్యలు చేసింది. కష్టాల్లో ఉన్న నాగబాబు కు అన్నం పెట్టి మంచి పొజీషన్ ఇస్తే ఇప్పుడు విషం కక్కుతున్నాడు స్నేక్ బాబు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది శ్రీ రెడ్డి. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి అంటూ ఉచిత సలహా కూడా ఇస్తోంది శ్రీరెడ్డి.

జబర్దస్త్ నుండి నాగబాబు వెళ్ళిపోయిన విషయం తెలిసిందే. జబర్దస్త్ నుండి వెళ్ళిపోయిన నాగబాబు తాజాగా సంచలన ఆరోపణలు చేసాడు దాంతో శ్రీరెడ్డి శ్యామ్ ప్రసాద్ కు మద్దతుగా వ్యాఖ్యలు చేస్తూ నాగబాబుని ఓ ఆట ఆడుకుంది. నాగబాబు పై శ్రీరెడ్డి వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. దాంతో మెగా ఫ్యాన్స్ శ్రీరెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేయడం ఖాయంగా కనిపిస్తోంది.