అమలా పాల్ పెళ్లి పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Published on Apr 02,2020 03:34 PM
హీరోయిన్ అమలా పాల్ రెండో పెళ్లి పై వివాదాస్పద భామ శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. నీ పంజాబీ మొగుడు నిన్ను బాగానే చూసుకుంటాడు , నువ్వేమీ బాధపడకు అమలా పాల్ ఎందుకంటే పంజాబీ వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు అంటూ పుండు మీద కారం చల్లింది శ్రీరెడ్డి. అమలా పాల్ -భవీందర్ సింగ్ ల పెళ్లి అంటూ ఇద్దరూ పెళ్లి దుస్తుల్లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అయితే అమలా పాల్ మాత్రం నాకు రెండో పెళ్లి కాలేదు , అవి కేవలం ఫోటో షూట్ కోసం చేసిన తతంగం తప్పితే నా పెళ్లి కాదు అని స్పష్టం చేసింది. కానీ ఎవరూ నమ్మడం లేదు అమలా పాల్ వ్యాఖ్యలను. ఎందుకంటే భవీందర్ సింగ్ కు లిప్ లాక్ ఇస్తూ పెళ్లి దుస్తుల్లో ఫోటోలు దిగింది మరి. అసలే మీడియా సైతం అమలా పాల్ రెండో పెళ్లి పట్ల ఒక నిర్ణయానికి రాగా ఇప్పుడు శ్రీరెడ్డి కూడా అమలా పాల్ కు పంజాబీ మొగుడు అని వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. మరి ఈ విషయం పై అమలా పాల్ ఎలా స్పందిస్తుందో చూడాలి.