అల్లు అర్జున్ విగ్గుపై కామెంట్ చేసిన శ్రీరెడ్డి

Published on Jan 08,2020 05:58 PM

అల్లు అర్జున్ ఎక్స్ టెన్షన్ విగ్గులు పెట్టుకుంటాడని , సినిమాల్లో అలాగే నటిస్తాడని సంచలన వ్యాఖ్యలు చేసింది వివాదాస్పద నటి శ్రీరెడ్డి. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసి సంచలనం సృష్టించిన ఈ భామ చెన్నై కి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే చెన్నై వెళ్లినప్పటికీ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉండే ఈ భామ ఎప్పటికప్పుడు ఏదో ఒక ఆరోపణ చేయడం చాలా కామన్ అయిపొయింది. తాజాగా అల్లు అర్జున్ విగ్గుపై కామెంట్ చేసింది శ్రీరెడ్డి. ఎప్పుడూ విగ్గులతోనే నటిస్తావా ? ఒరిజినల్ జుట్టుతో ఎప్పుడు నటిస్తావ్ ? అంటూ ప్రశ్నిస్తోంది శ్రీరెడ్డి.

మెగా హీరోలపై కామెంట్ చేయాలంటే చాలు ఎగిరి గంతేసి మరీ ఆరోపణలు చేస్తుంది శ్రీ రెడ్డి. ఇప్పటికే అందరు మెగా హీరోలను టార్గెట్ చేసిన శ్రీ రెడ్డి తాజాగా అల్లు అర్జున్ అల వైకుంఠపురములో విగ్గు పెట్టుకొని నటించాడని ఆరోపణలు చేసింది. ఇప్పుడు టాలీవుడ్ లో అల్లు అర్జున్ విగ్గు హాట్ టాపిక్ గా మారింది. విగ్గు సంగతి పక్కన పెడితే అల వైకుంఠపురములో ఈనెల 12న విడుదల అవుతోంది.