శ్రీరెడ్డి కారుని ధ్వంసం చేశారట

Published on Jan 03,2020 04:21 PM
వివాదాస్పద భామ శ్రీరెడ్డి కారుని ధ్వంసం చేశారట కొంతమంది ఆగంతకులు దాంతో తన కారుని కావాలనే ధ్వంసం చేసారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీరెడ్డి ఫిర్యాదుని స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివాదాస్పద భామ శ్రీరెడ్డి  ఖరీదైన ఆడి కారు కొన్న విషయం తెలిసిందే. కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి టాలీవుడ్ లో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. దాంతో హైదరాబాద్ ని వదిలేసి చెన్నై కి వెళ్ళిపోయింది. గతకొంత కాలంగా చెన్నై లో ఉంటున్న ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం బాగానే హల్చల్ చేస్తోంది.

అయితే చెన్నై లో అద్దెకు ఉంటున్న ఈ భామ ఇంటి పక్కనే ఓ వెబ్ సిరీస్ షూటింగ్ జరుగుతోందట. షూటింగ్ అంటే చాలా హడావుడి ఉంటుందన్న విషయం తెలిసిందే. నటీనటులు సాంకేతిక నిపుణులు కూడా పాల్గొంటారు కాబట్టి కార్ల సందడి కూడా ఎక్కువే ఉంటుంది. అయితే శ్రీరెడ్డి ఇంటి ముందరే కార్లు అడ్డంగా పెట్టి ఇబ్బంది పెడుతుండటంతో వాళ్లకు గట్టిగానే చెప్పిందట. ఇంకేముంది వాళ్ళు శ్రీరెడ్డి ఆడి కారుని ధ్వంసం చేసారు. ఆడి కారుపై గీరారట దాంతో గీతలు పడ్డాయి ఇంకేముంది పోలీసులను ఆశ్రయించింది శ్రీరెడ్డి. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు నిందితుల కోసం.