పవన్ కళ్యాణ్ పై మళ్ళీ విరుచుకుపడిన శ్రీ రెడ్డి

Published on Mar 11,2019 11:32 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఇప్పటికే పలుమార్లు సంచలన ఆరోపణలు చేసిన శ్రీ రెడ్డి తాజాగా మరోసారి పవన్ పై విరుచుకుపడింది . పవన్ కళ్యాణ్ ని తూ ..... నీ బతుకు అంటూ ఘోరంగా తిట్టింది . తాజాగా ఈ భామ ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి సంచలనం సృష్టిస్తోది . పూనం కౌర్ ని వాడుకొని వదిలేసాడని పవన్ కళ్యాణ్ పై ఆరోపణలు చేస్తోంది శ్రీ రెడ్డి . పూనం కౌర్ తన బాధనంతా నాకు చెప్పుకొని ఏడ్చిందని , ఆమె చెబుతుంటే విల విలా ఏడ్చానని అంత దారుణమైన బతుకా నీదు తూ ..... అంటూ అసలు మనిషిగా పనికిరావు అంటూ నిప్పులు కక్కుతోంది శ్రీ రెడ్డి . టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో భయకంపితులను చేసిన శ్రీ రెడ్డి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై పడింది . ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి .