ఢీ సీక్వెల్ ప్లాన్ చేస్తున్న శ్రీను వైట్ల

Published on Mar 10,2020 11:36 AM

2007 లో వచ్చిన ఢీ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచు విష్ణు - జెనీలియా జంటగా నటించిన ఈ చిత్రంలో కీలక పాత్రల్లో శ్రీహరి , బ్రహ్మానందం తదితరులు నటించారు. ఢీ సక్సెస్ లో దర్శకులు శ్రీను వైట్ల టేకింగ్ తో పాటుగా శ్రీహరి , బ్రహ్మానందం కీలక పాత్ర వహించారు. అప్పట్లో ఢీ ట్రెండ్ సెట్టర్ అయ్యింది ఆ సినిమాతోనే మంచు విష్ణు హీరోగా నిలదొక్కుకున్నాడు.

కట్ చేస్తే ఇన్నాళ్ల తర్వాత ఢీ సినిమాకు సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు దర్శకులు శ్రీను వైట్ల హీరో మంచు విష్ణు. చాలాకాలంగా శ్రీను వైట్లకు అలాగే మంచు విష్ణు కు సక్సెస్ ఫుల్ చిత్రాలు లేకుండాపోయాయి దాంతో రేసులో లేకుండాపోయారు ఈ ఇద్దరూ దాంతో కసితో ఢీ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారట. స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది ప్రస్తుతం అయితే స్క్రిప్ట్ పక్కాగా వస్తే మాత్రం సెట్స్ మీదకు వెళ్లడం ఖాయమని , స్క్రిప్ట్ పక్కాగా రాకపోతే మాత్రం సీక్వెల్ చేసేదిలేదని అంటున్నాడు మంచు విష్ణు.