మీసం తిప్పలేకపోయిన శ్రీవిష్ణు

Published on Nov 11,2019 05:22 PM

యంగ్ హీరో శ్రీవిష్ణు తాజాగా నటించిన చిత్రం తిప్పరా మీసం. కల్ట్ మూవీ గా భావించి ఆ సినిమా తీసాడు శ్రీవిష్ణు అయితే ఎన్ని ఆశలు పెట్టుకొని ఆ సినిమా చేసాడో కానీ ఆ సినిమా డిజాస్టర్ అయి శ్రీవిష్ణు మీసాన్ని తిప్పలేకపోయింది. సగర్వంగా మీసం తిప్పాలని చూసాడు శ్రీవిష్ణు కానీ తిప్పిన మీసాన్ని కిందకి దించేలా చేసింది తిప్పరా మీసం.

అయితే శ్రీవిష్ణు ప్రయోగం విఫలం అయినప్పటికీ మంచి టేస్ట్ ఉందని మాత్రం మరోసారి నిరూపించుకున్నాడు శ్రీవిష్ణు. నటుడిగా విభిన్న మార్గాన్ని ఎంచుకున్న శ్రీవిష్ణు చేసిన చిత్రాల్లో కొన్ని హిట్ అయ్యాయి అయితే కొన్ని మాత్రం ప్లాప్ అయ్యాయి. అయితే హిట్ అయినా ప్లాప్ అయినా సరే తన పంథా మార్చకుండా ముందుకు సాగుతున్నాడు శ్రీవిష్ణు.