పవన్ కళ్యాణ్ పై సంచలన ఆరోపణలు చేసిన శ్రీ రెడ్డి

Published on Mar 12,2019 10:47 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై సంచలన ఆరోపణలు చేసింది వివాదాస్పద భామ శ్రీ రెడ్డి . పూనం కౌర్ ని ప్రేమిస్తున్నానని చెప్పి ఆ అవసరం తీరాక ఆమెని దూరం పెట్టాడని , ఒక్క పూనం కౌర్ ని మాత్రమే కాకుండా ఇంకా చాలామంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడని సంచలన ఆరోపణలు చేస్తోంది శ్రీరెడ్డి . తన ఫేస్ బుక్ పేజీలో ఓ వీడియోని పోస్ట్ చేసి ప్రకంపనలు సృష్టించింది శ్రీ రెడ్డి . 

తెలుగులో పలు చిత్రాల్లో పూనం కౌర్ హీరోయిన్ గా  నటించింది అయితే ఆమధ్య పవన్ కళ్యాణ్ తో పూనమ్ కౌర్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని వినబడింది కట్ చేస్తే శ్రీ రెడ్డి ఓ 25 నిమిషాల వీడియో పెట్టి రచ్చ రచ్చ చేసింది . అయితే శ్రీ రెడ్డి ఇన్ని ఆరోపణలు చేసినప్పటికీ పవన్ కళ్యాణ్ కానీ పవన్ తరుపు వాళ్ళు కానీ ఈ ఆరోపణలను ఖండించలేదు . అలాగే పూనం కౌర్ కూడా నోరు మెదపలేదు ఏంటో మరి .