మహేష్ బాబు ని విమర్శించిన శ్రీ రెడ్డి

Published on Mar 14,2019 10:48 AM

వివాదాస్పద భామ శ్రీ రెడ్డి మహేష్ బాబు ని ఘాటుగా విమర్శించింది , అయితే మహేష్ బాబు ఫ్యాన్స్ నుండి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో మళ్ళీ తన పోస్ట్ ని డిలీట్ చేసింది . ఇంతకీ మహేష్ ని ఏమని విమర్శించిందో తెలుసా ......... ఎక్స్ప్రెషన్ పలకని మొహం మహేష్ బాబు ది అంటూ . టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న మహేష్ బాబు ని అంతలా విమర్శిస్తే ఫ్యాన్స్ ఊరుకుంటారా? 

అందుకే శ్రీ రెడ్డి పై విరుచుకుపడ్డారు దాంతో వెనక్కి తగ్గిన శ్రీ రెడ్డి మహేష్ పై చేసిన పోస్ట్ ని వెనక్కి తీసుకుంది . ఇటీవలే పవన్ కళ్యాణ్ పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడింది శ్రీ రెడ్డి . దాదాపు 25 నిమిషాల వీడియో ని పోస్ట్ చేసింది . అందులో పవన్ కళ్యాణ్ , త్రివిక్రమ్ లపై ఘోరమైన కామెంట్స్ చేసింది శ్రీ రెడ్డి.